శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో వినూత్నంగా రాఖీ వేడుకలు
శ్రీ
చైతన్య టెక్నో పాఠశాలలో వినూత్నంగా రాఖీ వేడుకలు
తన్య టెక్నో పాఠశాల, కొంపల్లి -1 సీబీఎస్ఈ శాఖలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి వృక్షాలకు రాఖీలు కట్టి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించారు. “వృక్షాలు మనల్ని రక్షిస్తాయి.. అన్నయ్యలా మనకు అండగా నిలుస్తాయి” అనే సందేశంతో విద్యార్థులు చెట్లకు రాఖీలు కట్టి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చాటిచెప్పారు. “వృక్షాలను రక్షిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అని నినదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సహాయక సర్వసభ్య నిర్వాహకులు రవి, సమన్వయకర్తలు భూపతి, సోమేష్, ప్రధానోపాధ్యాయులు రాజేష్ రెడ్డి, నాగరాజు, అధ్యాపక విభాగాధిపతి వంశీధర్ రెడ్డి, ప్రాథమిక విభాగ బాధ్యురాలు వాసవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

