*విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి*
*కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు*
టేక్మాల్ ఆగస్టు 21 మన ప్రజావాణి: విద్యుదాఘాతంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కుసంగి గ్రామంలో గురువారం నాడు జరిగింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పత్తిగారి ఎల్లా గౌడ్ (58) మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పొలం వద్ద విద్యుత్ పనులు మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అనుకోని ఈ ఘటనతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది కుటుంబానికి అండగా ఉండాల్సిన ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోవడంతో భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్నారు బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ తరపున బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని తగిన ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు సంబంధిత అధికారులు స్పందించి బాధితుడి కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు

