📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaవరి సాగు పై రైతులకి అవగాహన సదస్సు కార్యక్రమం

వరి సాగు పై రైతులకి అవగాహన సదస్సు కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:

బుధవారం సిర్దేపల్లి గ్రామంలోని రైతు వేదిక లో రైతులకు ఎల్ నినో ప్రభావం, ప్రస్తుత పంటల పరిస్థితి గురించి మండల వ్యవసాయ అధికారి రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. పత్తి పంట ప్రస్తుతం ఐదాకుల దశలో ఉందని ప్రస్తుతం రైతు సోదరులు కలుపు తీసుకుని తగినంత తేమ ఉన్నప్పుడు అడుగు మందులు వేసుకోవాలని సూచించారు. వర్షాలు తక్కువ కురిసే అవకాశం ఉన్నందున బోర్ల కింద వరి సాగు చేసే రైతులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మిగిలిన పొలంలో కూరగాయలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , మండల వ్యవసాయ అధికారి పి మల్లేష్, ఏ ఈ ఓ పద్మజ, సర్పంచ్ దామెర రాములు, గణపతి, ఆంజనేయులు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.