📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఎన్నిక

ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి నూతన కమిటీ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నూతన కమిటీలు ఎన్నిక

 

గోవిందు రవికుమార్ మాదిగ

ఎమ్మార్పీఎస్ దామెర మండల కో ఇంచార్జి

 

దామెర, ఆగస్టు 18: ప్రజావాణి

 

మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీతో పాటు అనుబంధ సంఘాల నూతన గ్రామ కమిటీలను మంగళవారం ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ దామెర మండల కో ఇన్‌చార్జి గోవిందు రవికుమార్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సీనియర్ నాయకులు ఆకునూరి రాజ్‌కుమార్ మాదిగ, గ్రామ ఉపసర్పంచుల సంఘం నాయకులు సంఘాల శేఖర్ మాదిగ, సంఘాల భరత్ మాదిగ, ల్యాదెళ్ల రవి మాదిగ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.

 

ఈ సందర్భంగా గోవిందు రవికుమార్ మాదిగ మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్ రాజీలేని పోరాటాలు నిర్వహించి ఎస్సీ వర్గీకరణ సాధించిందన్నారు. మాదిగలతో పాటు పేద, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి పలు సంక్షేమ పథకాలను సాధించిందని తెలిపారు.

 

మత దురహంకారం, కుల వివక్ష, సాంఘిక అసమానతలు లేని సమసమాజ నిర్మాణం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి బలమైన ప్రజా పోరాటాలను నిర్మించాలన్నారు. అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ఉద్యమించాలని సూచించారు.

 

ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, అనుబంధ సంఘాల కమిటీలు రద్దయిన నేపథ్యంలో గ్రామాల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూతన విద్యార్థులు, యువతను ఉద్యమంలోకి తీసుకువచ్చి క్షేత్రస్థాయిలో సంస్థలను బలోపేతం చేయాలని కోరారు. మహనీయుల ఆశయాల సాధన, పీడిత వర్గాల విముక్తి కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సూచించిన ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని అన్నారు. గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా బలపడుతూ రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 

ల్యాదెళ్ల గ్రామ ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

 

అధ్యక్షుడిగా చింతం ప్రభాకర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా ల్యాదెళ్ల ఎల్. రవి మాదిగ, ఉపాధ్యక్షుడిగా బాబు మాదిగ, కోశాధికారిగా సంఘాల నాగరాజ్ మాదిగ ఎన్నికయ్యారు.

 

ల్యాదెళ్ల గ్రామ ఎంఎస్పీ నూతన కమిటీ

 

అధ్యక్షుడిగా ముత్యం సురేందర్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ దయాకర్ మాదిగ, కోశాధికారిగా సంఘాల మల్లయ్య మాదిగ ఎన్నికయ్యారు.

 

పాల్గొన్న నాయకులు

 

చింతం చీరాల మాదిగ, చింతం కుమార్ మాదిగ, తాళ్ల చిన్ని మాదిగ, ఆకునూరి రాజ్‌కుమార్ మాదిగ, సంఘాల చింటూ మాదిగ, ల్యాదెళ్ల సురేష్ మాదిగ, చింతం రఘు మాదిగ, సంఘాల కుమారస్వామి మాదిగ, సంఘాల భరత్ మాదిగ, ఆకునూరి కుమార్‌స్వామి బాబు మాదిగ, సంఘాల శ్రీనివాస్ మాదిగ, సంఘాల రాజు మాదిగ, సంఘాల శేఖర్ మాదిగ, ఆకునూరి శరత్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

– గోవిందు రవికుమార్ మాదిగ,

ఎమ్మార్పీఎస్ దామెర మండల కో ఇన్‌చార్జి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.