బెజ్జంకి, ఆగస్టు 14 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా ఒగ్గు దామోదర్ ప్రమాణ స్వీకారం చేశారు. మండల కేంద్రంలోని ఏసీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా ప్యాక్స్ పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపాలని, ప్యాక్స్‌ను మరింత బలోపేతం చేసి రైతులకు అండగా నిలవాలని పేర్కొన్నారు.
రైతులకు అందుబాటులో ఉంటా:
ఒగ్గు దామోదర్
నూతన చైర్మన్ ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్యాక్స్ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా పనిచేసి ప్యాక్స్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్లు చెట్టి రాజు, నూనె రాజేందర్, కట్ట స్వరూప, ఆడకాని నర్సింగం, గంగాధర రామచంద్రం, కేడిక అపర్ణ, బైర రాజేందర్, తుమ్మ సుధాకర్ రెడ్డి, మాశం శంకర్, లింగాల రామవ్వ, కొమ్మరా తిరుపతి, కుక్కల రాములు,తదితరులు పాల్గొన్నారు.

