రైతుల సంక్షేమమే ధ్యేయం.. ప్యాక్స్‌ను బలోపేతం చేస్తాం బెజ్జంకి ప్యాక్స్‌ చైర్మన్‌గా ఒగ్గు దామోదర్‌ ప్రమాణ స్వీకారం నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

  బెజ్జంకి, ఆగస్టు 14 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్‌) చైర్మన్‌గా ఒగ్గు దామోదర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మండల కేంద్రంలోని ఏసీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, వ్యవసాయ సేవలు, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా ప్యాక్స్‌ పాలకవర్గం కృషి చేయాలని సూచించారు....