📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliరాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

 

 

 

 

పెద్దపల్లి ఆగస్టు 20 ప్రజావాణి:

 

కమాన్‌పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ దేశ అభివృద్ధికి, ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. యువతకు ప్రాధాన్యతనిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజీవ్‌గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవకు కాంగ్రెస్ శ్రేణులు అంకితమై పనిచేయాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు రంగు సత్యనారాయణ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, బొంగోని సదయ్య,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార మాజీ ఎంపీటీసీ లు శేవ్వా శంకరయ్య,పిల్లి చంద్ర శేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెన్ రెడ్డి కిషన్ రెడ్డి, మల్యాల మహేష్ గౌడ్, మహమ్మద్ యూసుఫ్ (లల్లు)ఉప సర్పంచ్ రాజమహేందర్, నగునూరి నర్సయ్య గౌడ్, చిగురు రవీందర్, ఇనగంటి శ్రావణ్ కుమార్ చాట్ల గట్టయ్య,మేడగొని విజయ్, చాట్ల రాయమల్లు, కాడిపల్లి సుమన్, కోలేటి సురేష్, కొంతం శ్రీనివాస్, పచ్చునురి రాజకుమార్, బోనాల పవన్, వెంగళి రాజయ్య,గర్రెపల్లి వెంకన్న, దాసరి రామస్వామి, మల్యాల చిన్న తిరుపతి, బత్తిని శ్రీనివాస్, బొంగుని వీరయ్య, బంగారి శ్రీనివాస్, ఆరేల్లి శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.