రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ హృదయపూర్వక శుభాకాంక్షలు
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పవిత్రమైన అనుబంధానికి, ప్రేమాభిమానాలకు ప్రతీక అయిన ఈ పండుగ మీ జీవితాల్లో ఎనలేని సంతోషాన్ని, ఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను.
నా కష్టసుఖాల్లో నీడలా తోడుండే నా ప్రియమైన అన్నయ్య రాఖీ పండుగ శుభాకాంక్షలు.నీ రూపంలో నాకు ఒక మంచి స్నేహితుడిని ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు.నువ్వు ఎక్కడున్నా క్షేమంగా, విజయాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. హ్యాపీ రక్షాబంధన్
నా బంగారు తల్లి, నా చిరునవ్వును కాపాడే నా ముద్దుల చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు.నీ ఆశీస్సులు, నీ ప్రేమే నాకు ఎల్లప్పుడూ కొండంత అండ.నిన్ను ఎల్లప్పుడూ రక్షించడానికి, నీకు తోడుగా ఉండటానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.


