*ముదిగొండలో ఎం ఆర్ పి ఎస్.ఎం.ఎస్.పి నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో*
*ముదిగొండ మండల కో ఇన్చార్జి పడిశాల నాగేశ్వరావు మాదిగ మండల బాధ్యులు బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ ఏండ్రాతి నాగరాజు మాదిగ*
*మన ప్రజావాణి మధిర ఆర్ సి ఆగస్టు 18*
ముదిగొండ మండలం ముదిగొండ గ్రామంలో ఎం ఆర్ పి ఎస్.ఎం.ఎస్.పి నూతన కమిటీల నిర్మాణం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో నూతన గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన గ్రామ కమిటీల వివరాలను అధికారంగా ప్రకటించారు. ముదిగొండ గ్రామ ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడిగా నామ శివ మాదిగ ముదిగొండ గ్రామ ఎం ఎస్ పి అధ్యక్షుడిగా కట్టకూరి ఉమారావు మాదిగ ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిగొండ మండల ఎంఎస్పి మాజి అధ్యక్షులు కో ఇన్చార్జి పడిశాల నాగేశ్వరావు మాదిగ, మండల బాధ్యులు బొడ్డు వెంకటేశ్వర్లు మాదిగ, ఏండ్రాతి నాగరాజు మాదిగ, బొడ్డు నాగరాజు మాదిగ, అంతోటి రమేష్ తో పాటు గ్రామానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు కమిటీ పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలియజేశారు

