ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
హన్మకొండలోని గార్డియన్ హాస్పిటల్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాసరి సుధాకర్ గారిని మంత్రి సీతక్క గారి PA బరిగల భాస్కర్ గారు పరామర్శించారు.
మంత్రి సీతక్క గారు మరియు ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఫైడాకుల అశోక్ గారి ఆదేశాల మేరకు సుధాకర్ గారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ₹50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
కష్టకాలంలో కార్యకర్తలకు తోడుగా నిలవడం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకత అని భాస్కర్ గారు పేర్కొన్నారు.
“ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వడమే మంత్రి సీతక్క గారి లక్ష్యం” అని తెలిపారు.
సుధాకర్ గారు త్వరగా కోలుకోవాలని మంత్రి సీతక్క గారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

