మానవత్వమే ముందుగా.. ఆపదలో అండగా

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి) హన్మకొండలోని గార్డియన్ హాస్పిటల్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాసరి సుధాకర్ గారిని మంత్రి సీతక్క గారి PA బరిగల భాస్కర్ గారు పరామర్శించారు. మంత్రి సీతక్క గారు మరియు ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఫైడాకుల అశోక్ గారి ఆదేశాల మేరకు సుధాకర్ గారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ₹50,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కార్యకర్తలకు తోడుగా...