📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamమన ప్రజావాణి వార్త కథనానికి స్పందన

మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి వార్త కథనానికి స్పందన

సమగ్ర భూ సర్వేలో సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి చర్యలు తీసుకుంటాం


నేలకొండపల్లి తాహసిల్దార్ రాంప్రసాద్ వివరణ

*చెరువు మాదారం మేజర్ కాలువకు అనుబంధంగా మరో కాలువ ఉన్నది


4ఎల్ ఎఫ్టీగా ఎన్ఎస్పి లో కొనసాగుతోంది


క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎన్ఎస్పి రికార్డుల ప్రకారం న్యాయం చేస్తాం…!


నేలకొండపల్లి ఎన్ఎస్పి ఏఈ మదీనా వెల్లడి..!!

మన ప్రజావాణి ప్రత్యేక కథనం..2


ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి


భూమి జాడ కోసం.. (వివరాల కోసం) చివరి వరకు పోరాడి.. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధురాలు.. పేదరికం నిరక్షరాస్యత మధ్యలో ఓ క్వారీ యజమానికి లీజుకు ఇచ్చారు. లీజు ముగిసి ఏళ్లు గడుస్తోంది.. కానీ కొందరు అక్రమ మట్టి మాఫియా  చెలరేగిపోయి ఓ ప్రాంతంలో (వీరికి చెందిన భూమిలో సుమారు 8 కుంటల్లో) పెద్ద లోయను చేసి తరలించారు. మరి కొంత భూమి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ చిన్న చిన్న గుట్టలు చుట్టూ పట్టా భూములు మధ్యలో బాధి త కుటుంబం కనీసం భూమికి సంబంధించిన వివరాలు కోసం దరఖాస్తులు మీద దరఖాస్తులు ఇచ్చినా గానీ ఉపయోగం లేకుండా పోయింది అనేది కుటుంబ సభ్యులు బాధితుల ఆరోపణలు.. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి గురించి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి నేడు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో సమగ్ర వివరాలతో నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన అక్కి చంద్రమ్మ అక్కి లక్ష్మయ్య అక్కి శ్రీను కుటుంబ సభ్యుల దుస్థితి గోసపై ప్రత్యేక కథనం అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన స్థానిక నేలకొండపల్లి తాహసిల్దార్ రాంప్రసాద్ సమగ్ర భూ సర్వేలో సర్వే చేసి హద్దులు నిర్ణయించి సర్వే నెంబర్లు గుర్తిస్తామంటూ మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఖమ్మం బ్యూరో ప్రతినిధికి వివరణ ఇస్తూ చెప్పారు. ఇదే విషయంపై స్పందించిన ఎన్ ఎస్ పి ఏఈ మదీనా చెరువు మాదారం మేజర్ కాలువకు అనుబంధంగా 4ఎల్ ఎఫ్ టి గా రికార్డులలో ఉన్నదని ఫీల్డ్ లో కూడా కాలువ రెండు మీటర్ల వెడల్పుతో కొనసాగుతుందని అన్నారు. బాధిత కుటుంబానికి పరిశీలించి ఎన్ఎస్పి రికార్డులు ప్రకారం సర్వే నెంబర్లు ఇతర వివరాలు అందజేస్తామంటూ అన్నారు. పేద కుటుంబం భూమి హక్కులు ఆవేదన లపై మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి అందించిన కథనానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వ్యక్తం అవుతోంది. కాగా తహసిల్దార్ ఎన్ఎస్పి అధికారుల హామీతో బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.