📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కాశినాయన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం,

కాశినాయన బీజేపీ మండల కార్యవర్గ సమావేశం,

📰 Generate e-Paper Clip

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై నాయకుల దిశానిర్దేశం.!

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిజెపి పిలుపు!

కాశినాయన (ఆగస్టు 4 ప్రజావాణి) భారతీయ జనతాపార్టీ ( బీజేపి) కాశినాయన మండల కార్యవర్గ సమావేశం గంగనపల్లె గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఇంటి వద్ద మండల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ శ్రేణులు.ఈ సమావేశానికి బీజేపీ మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణరెడ్డి సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బద్వేల్ మార్కెట్ యార్డ్ చైర్మన్,కాశినాయన మండల ఇంచార్జి నారిశెట్టి సుప్రజ ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఉట్టి శ్రీనివాసులు, బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్బంగా సుప్రజ ,ఉట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం, ప్రత్యేక ద్రృష్టి సారించింది అని,దీనిలో భాగంగానే బీజేపీ కార్యకర్తలకు,నాయకులకు సమన్వయం చేసి రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం మార్గ నిర్దేశం చేశారు.స్థానిక సంస్థలకు పోటీ చేసే పంచాయతీల జాబితాను జిల్లా అధ్యక్షుడికి పంపడం జరుగుతుంది అని తెలిపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజలతో మమేకమై నరేంద్ర మోడీ గారి పన్నెండు ఏళ్ల సుపరిపాలన,పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతీ కార్యకర్త క్రృషి చేయాలని,రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పొందే విధంగా బీఎల్వోలతో సమన్వయం చేస్తూ పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి నల్లమాస్ ప్రశాంతి,మండల ఉపాధ్యక్షులు బసిరెడ్డి విజయ్ భాస్కర్ రెడ్డి,సురేష్ నాయుడు,పవనకుమార్,ఎదురు నాగార్జున రెడ్డి,బిజెపి నాయకులు ప్రతాపరెడ్డి,చెన్నారెడ్డి,వేమీరెడ్డి నాగార్జున రెడ్డి,పులి వెంకటరెడ్డి పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.