📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyబాల్య వయసులో ప్రేమ చివరికి విషాదం

బాల్య వయసులో ప్రేమ చివరికి విషాదం

📰 Generate e-Paper Clip

•బాల్య వయసులో ప్రేమ.. చివరికి విషాదం

 

*16 ఏళ్ల బాలికకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఎంఢీఆర్ ఫౌండేషన్

పటాన్‌చెరు, ఆగస్టు 6 (ప్రజావాణి):

ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల లీజా అనే బాలిక చిన్న వయసులోనే ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో వారికి చెప్పకుండా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో భర్తతో కలిసి నివాసం ఉంటోంది. అయితే కుటుంబ జీవితంపై సరైన అవగాహన లేకపోవడం, భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న విభేదాలను తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లీజా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఒడిశాలో ఉండటం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించే అవకాశం లేకపోవడంతో ఎంఢీఆర్ ఫౌండేషన్ మానవత్వంతో స్పందించింది. ఫౌండేషన్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసి లీజాకు స్థానికంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంఢీఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం తమ సామాజిక బాధ్యత అని తెలిపారు. చిన్న వయసులో భావోద్వేగాలకు లోనై తీసుకునే నిర్ణయాలు జీవితాలను విషాదంలోకి నెట్టివేస్తాయని, ప్రేమ, వివాహం వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు యువత జీవిత వాస్తవాలను అర్థం చేసుకోవాలని సూచించారు.

అలాగే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలగడం, వారి సమస్యలను తెలుసుకుని సరైన మార్గనిర్దేశం చేయడం ఎంతో అవసరమన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్యే పరిష్కారం కాదని, కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన పెద్దలతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం వెతకాలని పిలుపునిచ్చారు.

ఈ విషాద ఘటన ప్రతి కుటుంబానికి, ప్రతి యువతకు ఒక గుణపాఠంగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.