📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguప్రాజెక్ట్ నగర్, మొట్లగూడెం అంగన్వాడీలలో తల్లిపాల వారోత్సవాలు

ప్రాజెక్ట్ నగర్, మొట్లగూడెం అంగన్వాడీలలో తల్లిపాల వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

  1. ప్రాజెక్ట్ నగర్, మొట్లగూడెం అంగన్వాడీలలో తల్లిపాల వారోత్సవాలు
    తల్లులు గర్భిణీలు, బాలింతలకు అవగాహన

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
గోవిందరావుపేట మండల కేంద్రంలో గురువారం
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా ప్రాజెక్ట్ నగర్ మరియు మెట్లగూడెం అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తల్లులు, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అంగన్వాడీ ఇంచార్జ్ టీచర్లు భాగ్యమ్మ, సునీత మరియు ఆయా భారతమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాల గురించి అవగాహన కల్పించారు.
డబ్బా పాలకు బదులుగా తల్లిపాలనే అందించాలని, ఇది బిడ్డల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు.
సరిగ్గా పాలివ్వడం, పోషకాహారం, పరిశుభ్రత గురించి కూడా వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న గర్భిణీలు, బాలింతలు సందేహాలు అడిగి నిపుణుల సలహాలు తీసుకున్నారు.
చివరగా అందరికీ పోషకాహారం అందించారు.
తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేసిన అంగన్వాడీ సిబ్బందిని స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.