ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కూనవరం మరియు కూటురు ప్రాథమిక కేంద్రల పరిధిలో ర్యాలీ
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం ఆగస్టు 20.
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం ఈరోజు ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా కూనవరం మరియు కూటూ రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపరిధిలో ర్యాలీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ర్యాలీలో దోమల నివారణ కోసం అనుసరించవలసిన మార్గాలను ప్రజలకు వివరించడం జరిగింది పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే కార్యక్రమాల ద్వారా దోమల్ని నివారించవచ్చని తెలియజేశారు, దోమల వలన మలేరియా,డెంగ్యూ చికెన్ గున్యా,మెదడువాపు, మొదలగు వ్యాధులు రాకుండా ప్రజల భాగస్వామ్యంతో అవగాహనతో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టవచ్చని తెలియజేశారు అందరూ దోమతెరలను వాడాలని దోమల నిర్మూలించడం కోసం నీటిని నిల్వలను తొలగించాలని,కూలర్లు కొబ్బరి చిప్పలు,ప్లాస్టిక్ గ్లాసులు, టైర్లు మొదలగు వాటిలో నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటూ రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసమూర్తి దొర మరియు కూనవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చేతన్ కుమార్ గారు మరియు సూపెర్వైజర్ శ్రీనివాస్, CHO లు, ANM లు, mpha (m) లు, ఆశా లు పాల్గొన్నారు.



