పొదిలి ఆగస్టు 15 ప్రజావాణి పెన్షనర్ల భవనంలో జెండా వందనం తరువాత “పెన్షనర్స్ వెల్కమ్ డే”కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సంవత్సరము జూన్ జూలై నెలలలో రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులను పెన్షనర్స్ సంఘంలో చేర్చు కొనుటను “పెన్షనర్స్ వెల్కమ్ డే ” కార్యక్రమం గా నిర్వహిస్తారు పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ఈ సంఘము తెలుసుకొని పరిష్కారానికి చొర చూపుతుందని,పెన్షనర్లకు కావలసిన సమాచారాన్ని తెలియచే స్తుందని అన్నారు.సంఘ కార్యక్రమాలను, ఇతర సేవలను గురించి అధ్యక్షులు ఏ బాదుల్లా,అసోసియేటెడ్ అధ్యక్షులు డిఎల్ నరసింహారావు క్లుప్తంగా వివరించారు అనంతరం కొత్తగా సంఘములో చేరిన మతుకు మల్లి సుబ్రహ్మణ్యం,మందలపు విజయ్ కుమార్ రెడ్డి,షేక్ జిలాని భాష, చిలక మోహన్,జాఫర్ జిలాని,ముల్లా గౌస్ సందాని,వెంకట రమణయ్య ని,గుంట,నాగేశ్వరరావు,కి పూల మొక్కలతో సత్కారం చేసి అభినందనలు తెలపడం జరిగినది.ఈ కార్యక్రమంలో,బాదుల్లా,మదార్ వలి,వీరా రెడ్డి,చిట్టెం శెట్టి సుబ్బారావు,దాసరి గురుస్వామి,కేజీ మోహన్ రావు, మీరా వలి,డిఎల్ నరసింహారావు,మహిళా కార్యదర్శి దానమ్మ,రిటైర్డ్ తాసిల్దారులు సువర్ణమ్మ, చంద్రావతి, ఇతర పెన్షనర్లు సుమారు 50 మంది పాల్గొన్నారు
పొదిలిలో ఘనంగా జరిగిన పెన్షనర్స్ వెల్కమ్ డే కార్యక్రమం
RELATED ARTICLES

