* ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం
* విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ
జైపూర్, ఆగస్టు 15, ప్రజావాణి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో శనివారం 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీపతి బాపూరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలసి జాతీయ గీతాన్ని ఆలపించారు.వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజ రెడ్డి, హౌసింగ్ ఏఈ కాంక్ష, ఏపీఓ బాలయ్య, కార్యాలయ సూపరింటెండెంట్ జి. భాగ్యలక్ష్మి, జైపూర్ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ ఇరిగిరాల శ్రావణ్, పంచాయతీ కార్యదర్శి బి. ఉదయ్ కుమార్ , కాంగ్రెస్ మండల నాయకులు చల్లా విశ్వంభర రెడ్డి, చల్లా సత్యనారాయణ రెడ్డి, అంబల్ల సంపత్ రెడ్డి, అంబల్ల రవి, ఎంపీపీ కార్యాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

