📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaపెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కు. ఘన స్వాగతం 

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కు. ఘన స్వాగతం 

📰 Generate e-Paper Clip

  • పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్లబెల్లి కీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కు. ఘన స్వాగతం 

 

  •  గుడెప్పాడు వద్ద కార్యకర్తలతో వేచి ఉన్న _వంగల నారాయణరెడ్డి

 

  • మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు..

 

భూపాలపల్లి నియోజకవర్గం, హనుమకొండ జిల్లా, కొప్పుల: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లబెల్లి కీ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నల్లబెల్లి కు వస్తున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు చేశారని, ఉద్యమ సమయంలో ఒక కన్ను కూడా కోల్పోయినప్పటికీ తెలంగాణ సాధన కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడని పలువురు కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయనకు నివాళులర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు నల్లబెల్లి కీ చేరుకున్నారు.

 

ఈ క్రమంలో హనుమకొండ జిల్లాలోని కొప్పుల గ్రామానికి చెందిన శాయంపేట మండల మాజీ జెడ్పీటీసీ రమాదేవి–నారాయణరెడ్డి దంపతులు తమ గ్రామం, మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి నల్లబెల్లి కి తరలివెళ్లారు. ప్రజా సేవా కార్యక్రమాలతో పాటు ప్రజల సమస్యలు, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడిగా వంగల నారాయణరెడ్డి మంచి గుర్తింపు పొందారని కార్యకర్తలు తెలిపారు.

కేసీఆర్ రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు వంగల నారాయణరెడ్డి తన కార్యకర్తలతో కలిసి రహదారి మార్గమధ్యంలోని గుడెప్పాడు వద్ద వేచి ఉన్నారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు, ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

 

పెద్ది సుదర్శన్ రెడ్డి వంటి త్యాగశీలి నాయకుడికి నివాళులర్పించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం ఆయనపై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనగా, నల్లబెల్లి కి పరిసర ప్రాంతాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.