📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriపూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో పూడూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సృజన, డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పూడూరు గ్రామంలోని అన్ని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు వారు పేర్కొన్నారు.

గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగరేణి పోచయ్య, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ సొసైటీ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ ఉప సర్పంచ్ మానేపల్లి వెంకటేష్, మాజీ వార్డు సభ్యులు హన్మంత్ రెడ్డి, శేషికుమార్, పుట్నాల శ్రీకాంత్‌తో పాటు గ్రామస్తులు తుపాకుల తిరుపతి, బక్క నాగరాజు, బక్క శేఖర్, గడ్డం బాబు, శ్రీశైలం యాదవ్, తుపాకుల ప్రభాకర్, డప్పు బిక్షపతి, మజ్జిగ శంకర్ రెడ్డి, కుంట రంగారెడ్డి, నీరుడి సుధాకర్, ఏర్పుల మహేష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.