పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో పూడూరు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సృజన, డిప్యూటీ కమిషనర్ సుధాంశుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పూడూరు గ్రామంలోని అన్ని రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు....