ఘనంగా హిందీ దివస్ వేడుకలు
ప్రజావాణి సెప్టెంబర్ 17 కమలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కమలాపూర్ లో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందీ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G కుమార్ అధ్యక్షత వహించారు
ఈ సందర్భంగా కళాశాల హిందీ అధ్యాపకురాలు శ్రీమతి రజిత హిందీ భాష యొక్క ప్రాముఖ్యత భారతదేశంలో హిందీ భాషకు ఉన్న విశిష్టత స్థానం విద్యార్థుల జీవితంలో హిందీ భాష అవసరం గురించి వివరించారు హిందీ భాషను ప్రేమించి గౌరవించి ధైనం దిన జీవితంలో సాధ్యమైనంతగా ఉపయోగించాలని విద్యార్థులకు సూచించారు

విద్యార్థులకు హిందీ భాష సాహిత్యం మరియు సాంస్కృతి పై అవగాహన కల్పించే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ A జ్యోతి కళాశాల అధ్యాపకులు రజిత కవిత శారద చంద్రశేఖర్ సరోజనన్ బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

