📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliపీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పొత్కపల్లిలో సందడిగా ‘మాక్ పోలింగ్’

పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పొత్కపల్లిలో సందడిగా ‘మాక్ పోలింగ్’

📰 Generate e-Paper Clip

 

 ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రత్యక్ష అనుభవం పొందిన విద్యార్థులు

 ఓటు హక్కు ప్రాధాన్యం, ఎన్నికల నిర్వహణపై సమగ్ర అవగాహన

 పెద్దపల్లి ఆగస్టు 8 ప్రజావాణి :

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించేందుకు మండల పరిధిలోని పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పొత్కపల్లి పాఠశాలలో శనివారం ‘మాక్ పోలింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకోవడం, ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ వి. హరికృష్ణ పర్యవేక్షణలో సాగిన ఈ మాక్ పోలింగ్‌లో విద్యార్థినీ విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అచ్చం అసలు ఎన్నికలను తలపించేలా ప్రాంగణంలో ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, ప్రాంగణంలోకి ప్రవేశం, ఓటు వేసే ప్రత్యక్ష విధానం, రహస్య ఓటింగ్ ప్రాధాన్యం వంటి అంశాలను ఉపాధ్యాయులు ప్రాయోగికంగా వివరించారు. విద్యార్థులే ఓటర్లుగా, పోలింగ్ సిబ్బందిగా వివిధ పాత్రలు పోషించి ప్రజాస్వామ్య నిర్వహణను ప్రత్యక్షంగా అనుభవించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తిమంతమైన సాధనమని, దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఓటరు పాత్ర కీలకమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ఉపాధ్యాయ బృందం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఇలాంటి ప్రాయోగిక అనుభవాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక స్పృహను పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.