📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamతేలిపోయిన మాజీ పంచాయతీ కార్యదర్శి "చీకటి తెరలు"...?

తేలిపోయిన మాజీ పంచాయతీ కార్యదర్శి “చీకటి తెరలు”…?

📰 Generate e-Paper Clip

తేలిపోయిన మాజీ పంచాయతీ కార్యదర్శి “చీకటి తెరలు”…?

2002 నుండి 2004 వరకు…?


*పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులు దగ్ధం కాలేదు…!


*ధ్రువీకరించిన చింతకాని ఎస్సై

*తప్పుడు వివరణలతో ఇటీవల సాక్షా లతో తప్పుదారి పట్టించిన మాజీ పంచాయతీ కార్యదర్శి…?

*ఇప్పటికైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన కార్యదర్శి పై వేటు వేస్తారా..?


*కలెక్టర్ ఆదేశాలు అంది… నేటికీ వివరణ ఇవ్వకుండా వ్యవహరిస్తున్న పట్టించుకోరు ఎందుకో…?


*వెసులుబాటు కల్పిస్తున్నారా…? అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు

*నిర్లక్ష్యంపై విచారణ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తారా….?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం…

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి ప్లాటు రేకుల షెడ్డు వ్యవహారంలో 9 నెలలుగా అనేక పరిణామాలకు దారితీస్తూ తెలుగు సీరియల్స్ ను మించి సాగుతూ ఉందని పలువురు స్థానికులు బాధితులు జిల్లా ప్రజలు హక్కుల సంఘాల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రస్తుత మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు చింతకాని మండలం పందిళ్ళపల్లి లో విధులు నిర్వహిస్తున్న సందర్భంలో సివిల్ సర్వీసెస్ చట్టం నిబంధనలు పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా వ్యవహరించారని నాటి డిపిఓ సమగ్ర విచారణ ఆధారంగా ధ్రువీకరించి గత 20 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసి అట్టి ఆదేశాలను మధిర మండల పరిషత్ కార్యాలయం ద్వారా సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి అందించారని సమాచారం. నాటి కలెక్టర్ ఆదేశాలలో లేఖఅందిన పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ పలు నిబంధనలను పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసినట్లు బాధితులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు రోజులు గడుస్తున్నప్పటికీ నేటి వరకు పంచాయతీ కార్యదర్శి వివరణ సమాధానం అందలేదని విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. పైగా సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి 2009 సంవత్సరం నుండి పందిళ్ళపల్లి పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించినట్లు స్థానికులు ప్రభుత్వ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ అవినీతి అక్రమాలకు అలవాటు పడిన సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి 2009 2010 రికార్డులు కనిపించడం లేదని నాడు పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహించే సమయంలో పంచాయతీ కార్యాలయం దగ్ధమైనట్లు ఆ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తప్పుదారి పట్టించే వివరణను సాక్షాత్తు నాటి డిపిఓ రాంబాబు ఎదుట వ్యాఖ్యానించి లిఖితపూర్వకంగా గత నెల క్రితం గ్రామంలోని కొందరిని కలిసి ఎంపీ ఓ కు సైతం తప్పుడు ధృవీకరణ లు అందించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పైగా కొన్ని కారణాలను విభేదాలను ఒడిసి పట్టిన సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి చేసిన నిర్వాకం చాలదన్నట్లు గ్రామస్తులను కలిసి ప్రైవేటుగా కొందరితో తప్పుడు వాంగ్మూలాలు సృష్టించినట్లు స్థానికులు మండల ప్రజలు బాధితులు ఆరోపిస్తున్నారు. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధికి అందిన సమాచారం మేరకు పందిళ్లపల్లి మైనర్ గ్రామపంచాయతీలో బిసి సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి సర్పంచిగా ఉన్న సమయంలో ప్రస్తుత రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఎర్రుపాలెం) రవికుమార్ పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్న సమయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని దాంట్లో రెండు ఫైళ్లు మాత్రమే అది కూడా పహానిలు కాలినట్టు అనంతరం వాటిని తిరిగి జనరేట్ చేసినట్లు సదరు మాజీ పంచాయతీ కార్యదర్శి రవికుమార్ (ప్రస్తుత రెవెన్యూ ఇన్స్పెక్టర్) మన ప్రజావాణి ప్రతినిధితో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. బాధితులు సమాచార హక్కు చట్టం ద్వార గత నెల 14వ తారీఖున స్థానిక చింతకాని మండల పోలీస్ స్టేషన్కు ఎఫ్ఐఆర్ కాపీ కేసు వివరాలు కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ మేరకు స్పందించిన చింతకాని ఎస్ఐ 2002-04 మధ్య ఎటువంటి ఫిర్యాదులు అందలేదని కేసులు నమోదు చేయలేదని ధృవీకరిస్తూ రికార్డుల పరిశీలన అనంతరం బాధితులకు సమాధానంగా లేక పంపించటం విశేషం.2001లో కానీ 2005లో గానీ ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ సమయంలో రవికుమార్ పంచాయతీ కార్యదర్శి గా ఇతను నిర్వహించినట్లు ప్రభుత్వ రికార్డులు తోపాటు సదరు నాటి పంచాయతీ కార్యదర్శి రవికుమార్ అంగీకరించడం కొస మెరుపు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి రికార్డులను తారు మారు చేసి అర్హత లేని వారికి అర్హత కల్పిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వ రికార్డులను భద్రపరచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా గతంలో అందిన ఆదేశాలను నేటి కలెక్టర్ ఆదేశాలను సైతం పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మాజీ పంచాయతీ  కార్యదర్శి పై తక్షణమే శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ప్రత్యేక విచారణ అధికారులు ఈ దిశగా దృష్టిని కేంద్రీకరించి సమగ్రంగా రికార్డులను పరిశీలించి నివేదిక కలెక్టర్కు నివేదిక అందించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పలువురు స్థానికులు మండల ప్రజలు హక్కుల సంఘాల నేతలు కార్యకర్తలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.