📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalపాండ్యతండాలో వేడుకగా తల్లిపాల వారోత్సవాలు

పాండ్యతండాలో వేడుకగా తల్లిపాల వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

పాండ్యతండాలో వేడుకగా తల్లిపాల వారోత్సవాలు

చెన్నారావుపేట ఆగస్టు 4 ప్రజావాణి

పసిపాపలకు తల్లిపాలే అమృతం అని, అవి పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని సర్పంచ్ మహబూబ్ సింగ్ పేర్కొన్నారు.మండలంలోని చెరువుకొమ్ముతండా పరిధి పాండ్యతండా అంగన్వాడీ కేంద్రంలో టీచర్ రాణి నిర్వహించిన అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు వేడుకగా సాగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సర్పంచ్ మాట్లాడుతూ.. బాటిల్ పాలకు దూరంగా ఉంటూ, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పడితే శిశువులకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. తల్లిపాల్లోని సహజ పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వాల్యతండా హెచ్‌ఎం చల్లా విష్ణువర్ధన్, అంగన్వాడీ టీచర్ రాణి, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.