EVENING EDITION
📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyపంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అభినందనీయం

పంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అభినందనీయం

📰 Generate e-Paper Clip

పంచాయతీ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం అభినందనీయం

  1. *పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్*

*భవన నిర్మాణ పనులను పరిశీలించి

గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు సర్పంచ్ చందు నాయక్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ చేపట్టడం అభినందనీయమని షాద్ నగర్ పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఫరూక్ నగర్ మండలం ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ లో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను డి ఈ శ్రీనివాస్, ఏఈ గోపాల్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనుల్లో సర్పంచ్ చందు నాయక్ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. స్టీల్, సిమెంటు, ఇసుక వంటి వస్తువులను ఉపయోగించి భవన నిర్మాణ పనులను చేపట్టడం, నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయడం అభినందనీయమని సూచించారు. పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని, ఈ నిధులకు అనుగుణంగా పనులు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గ్రామపంచాయతీలో నూతనంగా చేపట్టిన అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను సైతం అధికారులు పరిశీలించారు. సర్పంచ్ చందు నాయక్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యవారిపల్లి గ్రామం నుండి జయరాం తండా వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించేందుకుగాను చేపట్టనున్న పనులను పరిశీలించారు. బీటీ రోడ్డు నిర్మాణంలో చేపట్టనున్న కల్వర్టులు, వ్యవసాయ పొలాల రైతులతో అధికారులు నేరుగా చర్చించారు. పట్టా భూములు రోడ్డు నిర్మాణ పనుల్లో ఏమైనా వస్తున్నాయా అనే విషయాలను సైతం రైతులను అడిగి తెలుసుకున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతోనే ఉప్పరిగడ్డ గ్రామపంచాయతీ అభివృద్ధి జరుగుతుందని సర్పంచ్ చందు నాయక్ తెలిపారు. మున్ముందు పంచాయతీ అభివృద్ధిని మరింత చేసేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ చందు నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరిగడ్డ ఉపసర్పంచ్ శ్రీలత తిరుపతయ్య తోపాటు వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.