📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్నేడు బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణికి శ్రీకారం

నేడు బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణికి శ్రీకారం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 16 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలములోని ఆయా గ్రామాల ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్ తెలిపారు.ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు బెజ్జంకి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ సమస్యలు, వినతులు, వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజావాణిలో సమర్పించవచ్చని తెలిపారు.ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు పారదర్శకంగా, సమయపాలనతో సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.బెజ్జంకి మండల ప్రజలంలోని ఆయా గ్రామాల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.