ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను ‘రేవంత్ అన్న టీం’ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమర్థుడైన జగన్నాథ్ పోచారం ఐటీ కారిడార్ సీఐగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న 16న పోచారం పరిధిలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐని కోరారు.
ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టి విజయవంతంగా నిర్వహించాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

