నూతన సీఐ జగన్నాథ్‌కు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి శుభాకాంక్షలు…మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం
ఘట్‌కేసర్, ఆగస్టు 10 (ప్రజావాణి): పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన జగన్నాథ్‌ను ‘రేవంత్ అన్న టీం’ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ జగన్నాథ్‌కు శాలువా కప్పి ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సమర్థుడైన జగన్నాథ్ పోచారం ఐటీ కారిడార్ సీఐగా బాధ్యతలు స్వీకరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న 16న పోచారం పరిధిలో నిర్వహించనున్న బోనాల...