నాగుల పంచమి సందర్భంగా నాగదేవతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఆధ్యాత్మిక దైవచింతన మానసిక ప్రశాంతతను చేకూరుస్తుందని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో
నాగులపంచమి పర్వదినాన్ని పు
రస్కరించుకుని నాగేంద్ర స్వామి కి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే, నాగేంద్రుని పుట్టలో పాలు పోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
నాగులపంచమి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు , సకల సౌభాగ్యాలు, పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు చేకూర్చాలని, వర్షాలు అధికంగా కురిసి పాడి పంటలు పచ్చగా ఉండి, కరువు కాటకాలను, ప్రజలకు దరిచేరకుండా రక్షించాలని యశస్విని రెడ్డి నాగదేవతను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

