📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaనర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి కీ పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్...

నర్సంపేట నియోజకవర్గంలో నల్లబెల్లి కీ పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

  1. పెద్ది కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న కేసీఆర్‌కు ఘన స్వాగతం

 

గుడెప్పాడు వద్ద కార్యకర్తలతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్వాగతం పలికిన _ వంగల నారాయణరెడ్డి

 

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాట్లు

ప్రజావాణి శాయంపేట ఆగస్టు 9

భూపాలపల్లి నియోజకవర్గం, కొప్పుల: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు నల్లబెల్లికి వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి తన ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో త్యాగాలు చేశారని నాయకులు గుర్తుచేసుకున్నారు. ఉద్యమ సమయంలో ఒక కన్ను కోల్పోయినప్పటికీ తెలంగాణ సాధన కోసం చివరి వరకు పోరాడిన త్యాగశీలి నాయకుడిగా ఆయనను కొనియాడారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి తీరని లోటని పేర్కొంటూ, ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు, ఆయనకు నివాళులర్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు, కార్యకర్తలు నల్లబెల్లికి చేరుకున్నారు.

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా కొప్పుల గ్రామానికి చెందిన శాయంపేట మండల మాజీ జెడ్పీటీసీ రమాదేవి–నారాయణరెడ్డి దంపతులు తమ గ్రామం, మండలం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి నర్సంపేటకు తరలివెళ్లారు. ప్రజా సమస్యలు, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడిగా వంగల నారాయణరెడ్డి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని కార్యకర్తలు తెలిపారు.

 

కేసీఆర్ రాక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు వంగల నారాయణరెడ్డి తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి మార్గమధ్యంలోని గుడెప్పాడు వద్ద వేచి ఉన్నారు. తమ అభిమాన నాయకుడు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు, ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

 

పెద్ది సుదర్శన్‌రెడ్డి వంటి త్యాగశీలి నాయకుడికి నివాళులర్పించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావడం ఆయనపై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. నల్లబెల్లి పరిసర ప్రాంతాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.