దేశభక్తి స్ఫూర్తితో మెదక్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
మెదక్, ఆగస్టు 13: భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వికసిత భారత్ లక్ష్యంగా గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా ప్రజలందరిలో జాతీయ సమైక్యత, దేశభక్తి, స్వాతంత్ర్య స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
జాతీయ జెండాలతో నిర్వహించిన కార్యక్రమంతో మెదక్ జిల్లా కేంద్రం దేశభక్తి భావంతో మార్మోగింది. జాతీయ జెండాను చేతబట్టి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు చిన్మనమైన శ్రీనివాస్, ఈర్ల రంజిత్ రెడ్డి, నిజాంపేట మాజీ జెడ్పీటీసీ పంజాబీ చెయ్, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్ హర్ ఘర్ తిరంగా జిల్లా కన్వీనర్ శంకర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కాశీనాథ్ పాల్గొన్నారు.
అలాగే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మకొండ రాజేందర్, జిల్లా కార్యదర్శి సాధు అశోక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బైండ్ల సత్యనారాయణ, బట్ల జనార్ధన్, పట్లోళ్ల మల్లిక, జ్ఞాన్సింగ్, హర్ ఘర్ తిరంగా సహ కన్వీనర్లు రాజేశ్వరి, సాయి సన్నీ, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు అఖిల, భారత్, పప్పా, రాజమణి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు మెదక్ జిల్లాలోని వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మోర్చాల నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతి ఇంటిలో జాతీయ జెండాతో ఘనంగా నిర్వహించాలని, జాతీయ జెండా పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నాయకులు పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని వారు కోరారు.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి భావన మరింత బలపడుతోందని నాయకులు తెలిపారు. మెదక్ జిల్లాలోనూ గ్రామ గ్రామాన, ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో మెదక్ జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది.

