📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadతిరుపతి రెడ్డి కుమారుడిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తిరుపతి రెడ్డి కుమారుడిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

📰 Generate e-Paper Clip

తిరుపతి రెడ్డి కుమారుడిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో ఉన్న బీఆర్ గార్డెన్ లో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసి) చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి కుమారుడి దోతి కట్టు వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వేడుకలో పాల్గొన్నారు. శుక్రవారం
ఈ సందర్భంగా చిరంజీవిని ఆశీర్వదించి, అతని భవిష్యత్తు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అనుమాండ్ల తిరుపతి రెడ్డి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తొర్రూర్ మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మోత్కూరి రవీంద్ర చారి, టౌన్ పార్టీ అధ్యక్షులు పదో వార్డు కౌన్సిలర్, ముద్దసాని సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంజి విజయ్ పాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.