జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో మిన్నంటిన వేడుకలు
* ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం * విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ జైపూర్, ఆగస్టు 15, ప్రజావాణి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ప్రజా పరిషత్ (ఎంపీపీ) కార్యాలయంలో శనివారం 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీపతి బాపూరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలసి జాతీయ గీతాన్ని ఆలపించారు.వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు....