📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip



వేడుకల్లో పాల్గొన్న ఎంపీ అంబికా దంపతులు


అనంత పురం బ్యూరో ఆగస్టు 15 ప్రజా వాణి
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వేదికగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పాల్గొనడం జరిగింది. న్యూఢిల్లీలో ఎర్రకోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం  ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని ఎంపీ అంబికా తెలియజేశారు.దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరం అంకితభావంతో పనిచేయాలి.అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర్, శక్తివంతమైన భారతదేశ నిర్మాణంలో మన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ముందుకు సాగుదామని ఎంపీ అంబికా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని ప్రగతి పథం లో నడిపిస్తున్నారని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో పొగుడుతున్నారంటే దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.