📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘనంగా అన్నోజిగూడలో అమ్మవార్ల కల్యాణోత్సవం

ఘనంగా అన్నోజిగూడలో అమ్మవార్ల కల్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 14 (ప్రజా వాణి): కేల్ మహేంద్రా నగర్, అన్నోజిగూడ దివ్యాంగుల సకలాంగుల కాలనీలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కల్యాణోత్సవ కార్యక్రమం గూడూరు వెంకటేష్ స్వామి, ఒగ్గు అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎన్. రాములు, చైర్మన్ ఎం. శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు జీడి రవి గౌడ్, ప్రధాన కార్యదర్శి జింకల యాదగిరి, కోశాధికారి పి. ఎల్లన్న, సంయుక్త కార్యదర్శి ఎం. మైసయ్యతో పాటు కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ చౌదరి, రాజు గౌడ్, రాజు, శైలజ, సీహెచ్. కిష్టయ్య, అనసూయ, లావణ్య, ఎం. మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కల్యాణోత్సవాన్ని విజయవంతం చేసిన భక్తులకు, దేవాలయ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.