మేడ్చల్ డివిజన్: ప్రత్యేక సమగ్ర సవరణ సార్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో బీజేపీ పార్టీ తరఫున 90వ బూత్ బిల్ఎ గా రాఘవ రెడ్డి, 91వ బూత్ బిఎల్ఎ గా బండి విష్ణు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ పరిధిలోని ఓటర్ల జాబితాను వారు పరిశీలించారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను స్వీకరించి, అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో న్యాయం జరిగేలా సార్ ప్రక్రియను సమగ్రంగా పరిశీలించారు.ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగేందుకు బూత్ స్థాయిలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా, అనర్హమైన లేదా తప్పులున్న వివరాలపై తగిన అభ్యంతరాలు నమోదు చేసేలా చర్యలు చేపట్టారు. ఈ గ్రామ సభలో బీజేపీ సీనియర్ నాయకులు బొక్క శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొని సార్ ప్రక్రియను పరిశీలించారు. గ్రామ సభలో ఓటర్లు, బూత్ స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

