📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గిద్దలూరు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అర్బన్ సీఐ సురేష్ కు బీజేపీ వినతి

గిద్దలూరు ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అర్బన్ సీఐ సురేష్ కు బీజేపీ వినతి

📰 Generate e-Paper Clip

 

మార్కాపురం జిల్లా (ఆగస్టు10 ప్రజావాణి) గిద్దలూరు,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు,మార్కాపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు పి.వి. కృష్ణారావు సూచనలతో గిద్దలూరులో జనతా వారిది కార్యక్రమాన్ని గిద్దలూరు పట్టణ బిజెపి అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో లో నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను పరిశీలించి,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ కు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు.గిద్దలూరు పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రజలు,వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు సీఐ దృష్టికి తీసుకెళ్లారు.ప్రధాన రహదారులు,కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రోడ్లపై అక్రమంగా వాహనాల పార్కింగ్‌ను నియంత్రించాలని కోరారు.వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. బాదుల్ల మార్కెట్ యార్డ్డై డైరెక్టర్.ముప్పూరి శ్రీనివాసులు,నాగేశ్వరరావు టౌన్ వైస్ ప్రెసిడెంట్ పాండ సుబ్బరాయుడు,శివ కుమార్ రెడ్డి. బాజీ,సుబ్బారెడ్డి.కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.