కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్! అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోండి-గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి

బెజ్జంకి, ఆగస్టు 11(ప్రజావాణి) కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్ వంటి ప్రత్యేక కేటగిరీలకు చెందిన అర్హులకు చేయూత పథకం కింద పింఛన్లు అందనున్నాయని తెలిపారు. దివ్యాంగులకు ₹4,016, ఇతర ప్రధాన కేటగిరీలకు ₹2,016 చొప్పున పింఛన్...