కొండాపూర్ మండల నూతన ఇంచార్జ్ విద్యాధికారిగా శ్రీమతి ఎలిజబెత్.
దశరథ్ ఇన్చార్జి (ఎం ఈ ఓ) కు వీడుకోలు.
కొండాపూర్ ఆగస్టు 20(ప్రజావాణి):మండల నూతన ఇన్చార్జి విద్యాధికారిగా జెడ్పిహెచ్ఎస్ కొండాపూర్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎలిజబెత్ ఈరోజు చార్జి తీసుకున్నారు. ఇదివరకు ఇన్చార్జి ఎంఈఓ బాధ్యతలు చేపట్టిన దశరథ్ కు వీడ్కోలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో గజిటెడ్ సంఘం అధ్యక్షులు సంజీవరావు, మిగతా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎం ఆర్ సి సిబ్బంది ఉపాధ్యాయునీ , ఉపాధ్యాయులు, సడాకుల లక్ష్మణ్, మన్నే యాదగిరి, సాంబశివుడు, మల్లేశం, రమేష్, సంగమేష్, పెంటయ్య, తదితర ఉపాధ్యాయ సంఘం నాయకులు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు పాల్గొని ఇప్పటివరకు కొండాపూర్ ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టి పని చేసిన దశరథ్ కు, మరియు నూతనంగా కొండాపూర్ మండల ఇన్చార్జి ఎంఈఓ బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఎలిజబెత్ కు స్వాగతించి, శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించినారు.

