కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్
సంస్థాగత బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి
మన సమగ్ర ప్రజావాణి ఆగష్టు 21 ( జోగిపేట ) సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ
సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు.
సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్బంగా అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని అన్నారు. యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు భారతదేశ ప్రగతికి పునాది వేశాయని పేర్కొన్నారు.
దేశ ఐక్యత, అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయాలని నాయకులు సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం, ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు ) మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డిఆత్మకమిటి డైరెక్టర్ చిట్యాల మధు, ఖాలేదు, కౌన్సిలర్లు అరుణ్,అనిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంఘటన్ సృజన్ అభియాన్
RELATED ARTICLES

