📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliఓదెలలో అట్టహాసంగా ‘హర్ ఘర్ తిరంగా’

ఓదెలలో అట్టహాసంగా ‘హర్ ఘర్ తిరంగా’

📰 Generate e-Paper Clip

 

ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి: పుల్లూరి పృధ్వీరాజ్

ఓదెల/పెద్దపల్లి ఆగస్టు 10 ప్రజావాణి :

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఓదెల మండల కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, సగర్వంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయతా భావాన్ని మరింత పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా మండల కన్వీనర్ పుల్లూరి పృధ్వీరాజ్ మాట్లాడుతూ.. ప్రతి భారతీయుడు దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండాను గౌరవించడం మనందరి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సమైక్యతను చాటేలా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు.

జాతీయ జెండా మన దేశ గౌరవానికి, సార్వభౌమాధికారానికి ప్రతీక అని, ప్రతి పౌరుడిని ఒక్కతాటిపైకి తీసుకువచ్చే శక్తి త్రివర్ణ పతాకానికి ఉందని నాయకులు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల పార్టీ అధ్యక్షులు కరెంగుల శ్రీనివాస్, అనిల్‌రావు, తొట్ల సతీష్ యాదవ్, కుక్కల మహేందర్ యాదవ్, తీర్థాల కుమార్ స్వామి, మెరుగు సారంగం, పిట్టల మహేష్, చైతన్య ప్రసాద్, పోలోజు శ్రీహరి, వంగరి చందు, కొక్కుల శ్రీకాంత్, నరసింహాచారి, లింగాల గోపాల్‌రెడ్డి, అది సతీష్, తూడి రాజేందర్, సదన్ కుమార్, ఎంబడి రాజు, కృష్ణ, మహేందర్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.