ఓదెలలో అట్టహాసంగా ‘హర్ ఘర్ తిరంగా’

  ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి: పుల్లూరి పృధ్వీరాజ్ ఓదెల/పెద్దపల్లి ఆగస్టు 10 ప్రజావాణి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఓదెల మండల కేంద్రంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మండల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించి, సగర్వంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయతా భావాన్ని మరింత పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా మండల కన్వీనర్ పుల్లూరి పృధ్వీరాజ్...