ఎల్లంపేట్లో ఘనంగా కంచుగంట మహేష్ జన్మదిన వేడుకలు
శాలువాతో సన్మానించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు
ఎల్లంపేట్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎల్లంపేట్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కంచుగంట మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

