prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 7:11 pm Digital Edition : MAHESH MEDCHAL

ఎల్లంపేట్‌లో ఘనంగా కంచుగంట మహేష్ జన్మదిన వేడుకలు

ఎల్లంపేట్‌లో ఘనంగా కంచుగంట మహేష్ జన్మదిన వేడుకలు

శాలువాతో సన్మానించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు

ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి కంచుగంట మహేష్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రిసార్ట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఎల్లంపేట్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కంచుగంట మహేష్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.