📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఈనెల 23న శ్రీ వివేకానంద హైస్కూల్లో ఉచిత హెల్త్ క్యాంపు.

ఈనెల 23న శ్రీ వివేకానంద హైస్కూల్లో ఉచిత హెల్త్ క్యాంపు.

📰 Generate e-Paper Clip


ఈనెల 23న శ్రీ వివేకానంద హైస్కూల్లో ఉచిత హెల్త్ క్యాంపు.

రామకృష్ణ మఠం,సేవా సమితి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం.

బర్ల మధుకర్ చేతుల మీదుగా పోస్టర్ల ఆవిష్కరణ.

ఉమ్మడి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.

కోటగిరి/ప్రజావాణి:-రామకృష్ణ మఠం హైదరాబాద్,రామ కృష్ణ సేవా సమితి కోటగిరి వారి ఆధ్వర్యంలో ఆగస్టు 23 న కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద హైస్కూల్ నందు ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా శిబిరంపై అవగాహన కల్పించేందుకు కోటగిరి మండల సర్పంచుల ఫోరం కన్వీనర్ బర్ల మధుకర్ చేతుల మీదుగా గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బర్ల మధుకర్, క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ.పేద,మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఈ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ముఖ్యంగా వివిధ వ్యాధులతో బాధపడుతున్న కోటగిరి,పోతంగల్ మండల ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.