📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaఆత్మకూరు మండలం నీరుకుళ్లలో అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గం

ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గం

📰 Generate e-Paper Clip

ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గం

ప్రజావాణి ఆగస్టు 18

ఆత్మకూరు: మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో గత 30 ఏళ్లుగా గ్రామంలోని ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్న అంబేద్కర్ యువజన సంఘానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 

సంఘం గౌరవ అధ్యక్షులుగా అర్షం విజయలక్ష్మి (పేట ఉపాధ్యాయురాలు, పదవీ విరమణ), కవాటి భిక్షపతి (సైన్యం, పదవీ విరమణ), అర్షం దశరథం, అర్షం బాలరాం, అర్షం రాజుకర్‌లను ఎన్నుకున్నారు.

 

గౌరవ సలహాదారులుగా అర్షం జనార్దన్ (ఉపాధ్యాయుడు), అర్షం రాజేంద్రప్రసాద్ (ఉపాధ్యాయుడు), అర్షం దశరథం (ఉపాధ్యాయుడు), అర్షం భిక్షపతి వ్యవహరించనున్నారు.

 

అధ్యక్షులుగా అర్షం సునీల్, ఉపాధ్యక్షులుగా అర్షం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా కొంగర నరేష్, కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఆర్. శివరాజ్, కోశాధికారిగా అర్షం రాజు (కోళ్ల పెంపకం) ఎంపికయ్యారు.

 

సహాయ కార్యదర్శులుగా నడ్డునూరి రాజు, అర్షం పవన్, సాంస్కృతిక కార్యదర్శులుగా కొమ్ముల శరత్, నగరపు మొగిలి బాధ్యతలు చేపట్టనున్నారు.

 

కార్యవర్గ సభ్యులుగా అర్షం సుమన్, అర్షం సురేష్, నగరపు సాయిరాం, అర్షం జితేందర్, నగరపు రమేష్‌లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ యువజన సంఘం అభివృద్ధికి, గ్రామ ప్రజల సంక్షేమానికి సమష్టిగా కృషి చేస్తామని తెలిపారు. సంఘం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు గ్రామంలోని సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.