నంగునూరు, ఆగస్టు 31 (ప్రజావాణి):
నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన మహమ్మద్ షుకూర్ భార్య అలీమా అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో కుటుంబ పరిస్థితిని తెలుసుకుని 50 కిలోల బియ్యాన్ని తక్షణ సాయంగా అందించారు. అలీమా మృతి విషయం బొంగు శ్రీకాంత్ వంగ రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆయన ఆలస్యం చేయకుండా బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందించాలని సూచించారు. దీంతో 50 కిలోల బియ్యాన్ని కుటుంబానికి పంపించారు. వంగ రాజేశ్వర్ రెడ్డి అందించిన సహాయాన్ని గ్రామ యువకులు, వీఆర్ఆర్ టీం సభ్యులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారుఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వంగ రాజేశ్వర్ రెడ్డి.. అలీమా మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న కుటుంబానికి తక్షణ సాయం అందించడం పట్ల గ్రామస్తులు, స్థానిక యువకులు ఆయనను అభినందించారు.ఈ కార్యక్రమంలో బొంగు శ్రీకాంత్, ఫస్ట్ వార్డు మెంబర్ చందు, ముడిక రాజు, ఎండీ షర్ఫుద్దీన్, ఎండీ అజ్జు, ఎం.వినయ్, జె.కనకరాజ్, టి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.

