ఘట్కేసర్, ఆగస్టు 19 (ప్రజా వాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్నోజిగూడలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్న నర్సింహ గౌడ్, వెంకటస్వామి, అల్వాల్ దర్శన్ గౌడ్, నల్లవెల్లి శేఖర్, ముదిరాజ్, బి. కొండాల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, యంజాల శేఖర్ గౌడ్, బి. శంకర్ గౌడ్, రాదరం యాదగిరి, కొంత శంకర్ రెడ్డి, నెనావత్ బిక్కు నాయక్, రాదరం శ్రీశైలం, రెడ్యా నాయక్, యంజాల భాస్కర్ గౌడ్, నీలం సత్యం గౌడ్, నెనావత్ జితేందర్ నాయక్, ప్రభాకర్ నాయక్, సదానందం గౌడ్, యువజన సభ్యులు వినోద్ గౌడ్, వై. శివ గౌడ్, శశాంక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


