.భార్యను తప్పుగా మాట్లాడడంతో భర్త దాడి.
.కమలాపురం శివారులో విషాదం.
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
మంగపేట మండలం
కమలాపురం గ్రామ శివారులోని ఒక వ్యవసాయ భూమిలో వ్యవసాయ కూలీ దారుణ హత్యకు గురయ్యాడు.
పూరెడుపల్లి గ్రామానికి చెందిన దంపతులు మరియు గోంది గూడెం గ్రామానికి చెందిన యువకుడు కొంత కాలంగా పుల్లంశెట్టి శ్యామ్ కుమార్ పొలంలో కలిసి పని చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆ యువకుడు పూరెడుపల్లి గ్రామానికి చెందిన మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తుండడంతో ఆమె భర్త పలుమార్లు మందలించారు. అయినా అతడు మారలేదు.
ఒకరోజు రాత్రి సమయంలో మళ్ళీ ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో మాటల తూటాలు పేలడంతో ఆగ్రహానికి గురైన దంపతులు యువకుడిపై దాడి చేసి చంపారు.
సమాచారం అందుకున్న ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు మంగపేట ఎస్సై తమ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా పోలీస్ అభినందించారు.

